Pawan Kalyan: మాస్ అప్‌డేట్.. అదిరిపోయే కాన్సెప్ట్ తో పవన్ సురేందర్ రెడ్డి సినిమా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ అయిన సంగతి చాలామందికి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

New Update
Pawan Kalyan Surender Reddy

Pawan Kalyan Surender Reddy

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ అయిన సంగతి చాలామందికి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ మూవీ గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి తన బ్యానర్ SRT ఎంటర్‌టైన్మెంట్స్ పై నిర్మించబోతున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ సినిమా అనౌన్స్ చేసినా, కోవిడ్-19, పవన్ కల్యాణ్ రాజకీయ బాధ్యతలు, అలాగే సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేనితో చేసిన "ఏజెంట్" సినిమాలో బిజీ అవడం వంటి కారణాల చేత ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతుందనే సంకేతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను పూర్తి చేసేశాడు. దీంతో, ఇప్పుడు తన కాల్షీట్లు సురేందర్ రెడ్డికి ఇవ్వనున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

స్టైలిష్ మేకింగ్‌..

సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ మేకింగ్‌కు పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో హీరోల పాత్రలు చాలా డిఫరెంట్‌గా, ఎనర్జీటిక్‌గా కనిపిస్తాయి. అందుకే పవన్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌కి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో నిర్మాత రామ్ తల్లూరి మాట్లాడుతూ, ఈ సినిమా జరుగుతుందో లేదో స్పష్టత లేకపోయిందని చెప్పారు. అయితే స్క్రిప్ట్ వినగానే పవన్ చాలా ఇష్టపడ్డారని, నరేషన్ తర్వాత ఆయన వచ్చి హగ్గ్ కూడా చేశారని చెప్పారు. రామ్ తల్లూరి మాట్లాడుతూ, ఈ సినిమా Kick, Race Gurram స్టైల్‌లో ఉంటుంది. అంటే ఇందులో మాస్, స్టైల్, ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్‌ అయ్యే అవకాశం ఉంది.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ అవుతుండటం, అభిమానుల్లో మంచి హైప్‌ను తీసుకొస్తోంది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇది మొదలైతే, ఇది పవన్ కెరీర్‌లో మరో స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్‌గా నిలవనుందని ఆశిస్తున్నారు. పవన్ – సురేందర్ రెడ్డి కాంబో సినిమా మొదలైతే, మరి ఇంకేముంది.. ఫ్యాన్స్ OG లాంటి మాస్ ఫీస్ట్ కోసం రెడీ అవ్వాల్సిందే!

Advertisment
తాజా కథనాలు