/rtv/media/media_files/2025/09/21/og-pawan-2025-09-21-21-22-06.jpg)
సుజీత్ చెప్పేది తక్కువ...చేసేది ఎక్కువ. సినిమా తీసేటప్పుడు మామూలుగా ఉండదు. ఓజీ సీనీమా క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది అన్నారు పవన్ కల్యాణ్. ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ గురించి మాట్లాడారు. సుజీత్ విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన మరో వ్యక్తి తమన్. ఈ ఇద్దరూ ఒక ట్రిప్ లో మూవీ చేశారు. అందులోని నన్నూ లాగారు. ఒక కత్తి చుట్టూ కథను అల్లి...రంజింపచేసేలా సినఇమా తీశారు. ఖుషీ లో ఖటానా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఓజీ సినిమా అంతా దాని చుట్టూతానే ఉంటుంది.
సుజీత్ టీమ్ అద్భుతం...
పాలిటిక్స్ లోకి వెళ్ళినా అబిమానులు నన్ను వదల్లేదు. ఇప్పుడు కూడా సినిమా, రాజకీయాలు అంటూ నేను పోరాటం చేస్తున్నా అంటే దానికి కారణం అభిమానులే. సినిమా చేస్తున్నప్పుడు ఈ ఒక్క ఆలోచనే నన్ను నడిపిస్తుందని అంటూ పవన్ చెప్పుకొచ్చారు. సుజీత్ నాకు జపనీస్ నేర్పించాడు. ఇలాంటి దర్శకత్వ టీమ్ నేను ‘జానీ’ చేసినప్పుడు ఉంటే రాజకీయాల్లో వచ్చే వాడిని కాదు. తెలుగు వాడంటే ఆకాశం ఉరుముతోంది అంటూ పవర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మి అద్భుతంగా నటించారు. భవిష్యత్ లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే, శ్రియారెడ్డితో మళ్లీ కలిసి నటిస్తా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎల్బీ స్టేడియంలో ఓజీ కాన్సెర్ట్ జరిగింది. దీనికి పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని వచ్చారు. ఈ వెంట్ మొదలైన దగ్గర నుంచీ ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయినా సరే దాన్నిలెక్క చేయకుండా అభిమానుల కోసం పవన్ కల్యాణ్ సహా చిత్ర బృందం మొత్తం వర్షంలోనే తడుస్తూ పెర్ఫామెన్స్ ఇచ్చారు.