సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఎలక్షన్స్ కన్నా ముందు కమిట్మెంట్ ప్రకారం ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలి. అందుకే పొలిటికల్ మీటింగ్స్ నుంచి కాస్త టైం దొరికినా వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. మంగళగిరిలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసారు.
Also Read : ఏపీలో ‘పుష్ప2’ టికెట్ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
సెట్స్ లో పవన్ సెల్ఫీ..
హరిహర వీరమల్లు సెట్స్ లో దిగిన సెల్ఫీని షేర్ చేసి.. చాలా బిజీగా ఉండే పొలిటికల్ షెడ్యూల్స్ నుంచి నా సమయంలో కొన్ని గంటలు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న వర్క్ కి కేటాయించాను అని పోస్ట్ చేసాడు. దీంతో పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ ను మళ్లీ వీరమల్లు గెటప్ లో చూసి తెగ సంబరపడిపోతున్నారు.
Also Read : Vitamin D: శీతాకాలంలో ఈ సమయంలోనే విటమిన్ డి లభిస్తుంది
ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదల కానుంది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమా అంచనాలను పెంచేశాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read : 'పుష్ప2' లో ఆ సీన్ చూసి మైండ్ దొబ్బింది.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్
Also Read : వైకాపా నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!