సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఈ మధ్యే తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇటీవలే ఆయన 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో జాయిన్ అయినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఇదిలా ఉంటే పవన్ రీసెంట్ గా ఓ తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ క్రమంలో సినిమాల గురించి ప్రస్తావన రాగా తమిళ్ లో తన ఫేవరేట్ కమెడియన్, డైరెక్టర్స్ గురించి మాట్లాడారు. దీంతో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." తమిళ్ లో యోగి బాబు గారంటే ఇష్టం. ఆయన నటన చాలా బాగుంటుంది. ఇటీవల ఆయన నటించిన ఒక సినిమా చూసాను. అందులో సర్పంచిగా యోగి నటన బాగుంది.
అతని ఫిలిం మేకింగ్ నచ్చుతుంది..
చాలా బాగా పర్ఫార్మ్ చేసారు, బాగా నవ్వుకున్నాను అని తెలిపారు. ఇక డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ.. మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ నచ్చుతుంది. ఇటీవల లియో, విక్రమ్ సినిమాలు చూసాను. అతని ఫిలిం మేకింగ్ బాగుంది" అని అన్నారు.
ఇక ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్.. లోకేష్ కనగరాజ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో ఓ సినిమా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అని, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఈ కాంబో వర్కవుట్ అవ్వాలని నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో మొదట 'హరిహర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది మార్చి 28 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.