OG USA Premieres: అమెరికాలో ‘OG’ ప్రీమియర్ కలెక్షన్లకు భారీ షాక్..

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలకి కంటెంట్ ఆలస్యం కావడంతో, అక్కడి కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశముంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నా, AMC వంటి థియేటర్లు షోలు రద్దు చేస్తున్నాయి. కంటెంట్ డిలే అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది.

New Update
OG USA Premieres

OG USA Premieres

OG USA Premieres: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘OG’ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ చూసి ఫ్యాన్స్  “వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్” అంటూ తెగ సంబరపడిపోతున్నారు. 

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

అయితే సినిమా విడుదలకు ముందు ఓ కీలక విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. OG సినిమా అమెరికాలో ప్రీమియర్ షోలకు కంటెంట్ ఇంకా రాకపోవడం, అక్కడి బిజినెస్‌కి పెద్ద నష్టాన్ని తీసుకురానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో కంటెంట్ డెలివరీ ఆలస్యం సినిమాకు మైనస్ అయ్యేలా ఉంది.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

USA & కెనడాలో షోలు రద్దు..?

అమెరికా, కెనడా థియేటర్లలో కొన్ని ప్రీమియర్ షోలు రద్ధయేలా ఉందని సమాచారం. ముఖ్యంగా AMC వంటి ప్రముఖ థియేటర్ చైన్‌లు, డేటా (కంటెంట్) ముందే అందాల్సిన షరతుతో పనిచేస్తాయి. కానీ ఇంకా OG సినిమా రెండో భాగం (సెకండ్ హాఫ్) కంటెంట్ అందలేదట. ఈ ఆలస్యం వల్ల ప్రీమియర్ కలెక్షన్లపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది.

OGపై అభిమానుల్లో అసంతృప్తి

ఈ ఆలస్యం అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది. పెద్ద బడ్జెట్‌తో, భారీ ప్రమోషన్లతో వస్తున్న OG నుంచి అంతా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను ఆశించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కొన్ని ప్రదర్శనలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఫ్యాన్స్‌కి షాక్‌ ఇచ్చే అంశంగా మారింది.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

OG మూవీ హైలైట్స్

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర్ అనే పాత్రలో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం, డీవీవీ దానయ్య నిర్మాణం ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇప్పుడు OG టీమ్ త్వరగా సమస్యను పరిష్కరించి, USA ప్రీమియర్ షోలను కాపాడితేనే, ఓవర్సీస్ మార్కెట్‌లో అంచనాలకు తగిన ఫలితాలు వస్తాయి.

Advertisment
తాజా కథనాలు