OG Trailer Review: ఇది కూడా అస్సామేనా..? 'OG' ట్రైలర్ ఎలా ఉందంటే..?

పవన్ కళ్యాణ్ 'OG' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ సుజీత్ ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అందించాడు. కథాపరిణామం కొంత రొటీన్ గా అనిపించినా, మొత్తం మీద ట్రైలర్ హైప్ పెంచింది.

New Update
OG Trailer Review

OG Trailer Review

OG Trailer Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘OG’ సినిమాతో(OG Movie) బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టడానికి భారీగా రెడీ అవుతున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే... ఇది అభిమానుల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన మాస్ ట్రీట్ అని స్పష్టమవుతుంది. ట్రైలర్‌లో పవన్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, స్టైల్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ ట్రైలర్‌పై డీటెయిల్ గా ఒక లుక్కేద్దాం. 

Also Read :  'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!

హైలైట్స్ (పాజిటివ్ పాయింట్లు):

పవన్ మేనియా.. పవన్ కళ్యాణ్ ఈ ట్రైలర్‌తో మరోసారి తన పవర్ చూపించాడు. యాక్షన్, డైలాగ్స్, మాస్ అప్పీల్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

డైరెక్టర్ సుజీత్ గట్టిగానే ప్లాన్ చేశాడు.. ఫ్యాన్స్‌ను మెప్పించడానికి అవసరమైన మాస్ ఎలిమెంట్స్ అన్నీ కచ్చితంగా ఉన్నాయి. ప్రతి సీన్ ఓ స్పెషల్ స్టైలిష్ ఎంటర్టైన్మెంట్‌గా రిచ్‌గా కనిపిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి..  సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే.. అన్ని చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. 

తమన్ మ్యూజిక్ బాగుంది..  కొన్ని ట్రాక్స్ 'విక్రమ్' స్టైల్‌ను గుర్తు చేసినా, తమన్ తన మార్క్ మ్యూజిక్‌తో సినిమాకు స్పెషల్ టచ్ ఇచ్చాడు. జపనీస్, లోకల్ స్టైల్స్‌ మిక్స్ చేశాడు.

పవర్‌ఫుల్ కాస్టింగ్.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఓ రాయల్ లుక్‌లో కనిపించాడు. అర్జున్ దాస్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి.

ఆకట్టుకుంటున్న యాక్షన్ సీన్స్.. ఫైట్లు, యాక్షన్ గ్రాండ్‌గా ఉన్నాయి. విజువల్‌గా ట్రైలర్ చాలా బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దారు.

పవర్ ఫుల్ డైలాగ్స్.. పవన్ చెప్పిన డైలాగ్స్ బాగా క్లిక్ అయ్యాయి. 'బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త'... లాంటి డైలాగ్స్ పవర్ ఫుల్ గా అనిపించాయి. 

క్లాస్‌ ఎడిటింగ్.. కథను ఎక్కువగా రివీల్ చేయకుండా, ఆసక్తికరంగా ట్రైలర్‌ను కట్ చేశారు. స్టార్టింగ్, బిల్డ్ అప్, క్లైమాక్స్ అన్నీ పక్కా ప్లాన్ తో ట్రైలర్ కట్ చేశారు.

Also Read: OG: ఓజీ ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. వైరలవుతున్న ఫొటోలు

నెగెటివ్స్.. 

కథ కొంచెం అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ను గుర్తు చేస్తుంది. కొత్తదనం ఆశించినవారికి ఇది కొంత డిజప్పాయింట్ కావొచ్చు.

హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్రలో ఎమోషన్ ఉంది కానీ, ట్రైలర్‌లో ఆమె పాత్ర అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. హీరోయిన్ పాత్ర కొంచెం బలహీనంగా కనిపిస్తుంది. 

ట్రైలర్ ఆఖరి సీన్ ఫ్లో బ్రేక్ చేసింది.. చివర్లో ఉన్న సీన్ ట్రైలర్ వైబ్ కి సరిగ్గా సరిపోలేదు. మే బీ ఫుల్ మూవీలో బాగుండొచ్చు.

మొత్తానికి ట్రైలర్ వరకు చూస్తే రొటీన్ రివెంజ్ డ్రామాగా కొంతమందికి అనిపించొచ్చు. మరి పూర్తి కథా బలం తెలియాలంటే మూవీ చుస్తేకాని చెప్పలేం. 

ఫైనల్ గా.. 

‘OG’ ట్రైలర్ ఓ మాస్ బ్లాస్ట్ లాగా ఉంది. మొదటి రిలీజ్ చేసిన గ్లింప్స్ కంటే ట్రైలర్ కి హైప్ బాగా పెరిగింది. పవన్ ఫ్యాన్స్‌కి ఇది నిజమైన పండుగ లాంటిది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జోరున వర్షం పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ మైక్ తీసుకొని ఈవెంట్ ని తన భుజాలపై వేసుకొని హ్యాండిల్ చేసిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక సినిమాలో కథ, పవన్ స్టార్డమ్, టెక్నికల్ హై స్టాండర్డ్స్‌ని బాగా బ్యాలెన్స్ చేస్తే, పవన్ నుండి ఓ మంచి సినిమా ఎక్స్‌పీరియెన్స్ రాబొతుందని చెప్పొచ్చు.

Advertisment
తాజా కథనాలు