OG Ticket Hike Issue: 'ఏయ్ బాబు నీ ఒక్కడికే 100 డిస్కౌంట్.. పండగ చేసుకో'..! అభిమానికి DVV బంపరాఫర్..

‘OG’ సినిమా టికెట్ ధరల పెంపు‌పై హైకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది, ఇది కేవలం పిటిషన్ దారుడు బర్ల మల్లేశ్ యాదవ్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీనిపై మేకర్స్ సరదాగా స్పందిస్తూ, "మల్లేశ్‌గారికి ₹100 డిస్కౌంట్ ఆఫర్" అంటూ ఫన్నీ గా పోస్ట్ చేయడం వైరల్ అవుతోంది.

New Update
OG Ticket Hike Issue

OG Ticket Hike Issue

OG Ticket Hike Issue: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘OG’ సినిమా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా, టికెట్ ధరల పెంపు విషయంలో మాత్రం వివాదం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 'OG' సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచేందుకు ఇచ్చిన అనుమతిని, హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

ఈ వివాదానికి కారణమైన వ్యక్తి, బర్ల మల్లేశ్ యాదవ్(OG Mallesh) అనే వ్యక్తి. ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి, టికెట్ ధరల పెంపు ప్రజలకు భారంగా మారుతుందని ఆరోపించారు. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు, ఆయనకు అనుకూలంగా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులు పిటిషన్ దారుడికి మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.

Also Read :  ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే

ఈ నేపథ్యంలో, సినిమా నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్(DVV Entertainment) తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక సరదా పోస్టుతో స్పందించింది. వారు రాసిన ట్వీట్ ఇలా ఉంది.. 

మల్లేశ్ గారికి ₹100 డిస్కౌంట్..

“తమిళనాడులో కాదు, నిజాం ప్రాంతంలోని ఏ థియేటర్‌కైనా మల్లేశ్ గారికి ₹100 డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం! మల్లేశ్ గారు, మా అభిమానుల్లాగే మీరు కూడా 'OG' సినిమాను ఆస్వాదించాలి అని ఆశిస్తున్నాం!”

ఈ పోస్ట్ అభిమానులను నవ్వులు తెప్పించడమే కాకుండా, పిటిషన్ దారుడిపై ఫన్నీ గా ఎదురుదాడి చేసినట్టైంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది కూడా.

ఇదిలా ఉండగా, ఈ టికెట్ ధరల వివాదంపై తదుపరి విచారణ అక్టోబర్ 9న జరగనుంది. ఈ వ్యవహారం ఎటు వెళ్లుతుందో చూడాలి. ఈ ఘటనతో రాబోయే పెద్ద సినిమాలకు ఇకపై టికెట్ ధరల పెంపు అవకాశం లేదనుకుంటున్నారు. కానీ చివరికి ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. మొత్తానికి ‘OG’ బాక్సాఫీస్ దగ్గర హవా చూపిస్తుంటే, టికెట్ ధరల వివాదం మరో వైపు వార్తల్లో నిలుస్తోంది. 

#Pawan Kalyan #OG Ticket Hike Issue #OG Mallesh #DVV Entertainment
Advertisment
తాజా కథనాలు