OG Shows Cancel: బిగ్ బ్రేకింగ్... 'OG' ఫస్ట్ డే షోలన్నీ క్యాన్సిల్..

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న ‘OG’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా USA, కెనడాలో కంటెంట్ ఆలస్యం కారణంగా షోలు రద్దయ్యాయి. వసూళ్లపై ప్రభావం పడినప్పటికీ, ఫ్యాన్స్ సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు.

New Update
OG Shows Cancel

OG Shows Cancel

OG Shows Cancel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'OG' (ఓజీ)పై  అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్(Director Sujeeth) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాపై ప్రేక్షకుల్లో గట్టి హైప్ ఉంది. DVV దానయ్య బ్యానర్ లో, థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్‌గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇది అతని తొలి తెలుగు సినిమా కావడం విశేషం. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటించగా, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో దాదాపు 2.11 మిలియన్ డాలర్లు (రూ. 17.5 కోట్లకు పైగా) వసూళ్లు నమోదయ్యాయి. అయితే, ఈ ఫిగర్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.

USA, కెనడాలో షో రద్దులు.. (OG USA, Canada Shows Cancel )

OG సినిమా కంటెంట్ పంపిణీలో ఆలస్యం కావడంతో AMC వంటి పెద్ద థియేటర్ చైన్‌లు షోలను రద్దు చేశాయి. అమెరికాలోని కొన్ని థియేటర్లు సినిమాను ప్రదర్శించాలంటే విడుదలకు కొన్ని రోజుల ముందే కంటెంట్ అందాల్సి ఉంటుంది. అయితే OG సినిమా ఫస్ట్ హాఫ్ కంటెంట్ ఆలస్యంగా వచ్చిందని, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా రాలేదని తెలుస్తోంది.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

 OG తమిళ వెర్షన్ లేనట్టే.. (OG Tamil Version Cancel)

ఈ ఆలస్యం కారణంగా OG సినిమా అమెరికాలో $80,000, కెనడాలో $160,000 ఆదాయం నష్టపోయినట్లు సమాచారం. దీంతో అక్కడ షోలు రద్దవడం వల్ల అభిమానుల్లో నిరాశ నెలకొంది. అంతే కాకుండా, OG తమిళ వెర్షన్ కూడా నార్త్ అమెరికాలో పూర్తిగా రద్దైంది. దీంతో ఈ సినిమా ఇప్పుడు కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే విడుదల కానుంది.

2023లో ప్రారంభమైన షూటింగ్, వివిధ కారణాలతో ఆలస్యం కావడంతో 2025లో విడుదల అవుతోంది. ట్రైలర్ కూడా ముందుగా విడుదల అవ్వాల్సినప్పటికీ, సెప్టెంబర్ 21 సాయంత్రం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ సమయంలో మాత్రమే చూపించారు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు యూట్యూబ్ లో రిలీజ్ కాలేదు. దీనితో ఫ్యాన్స్ DVV ప్రొడక్షన్ హౌస్ పై సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

ఈ మూవీపై అభిమానుల్లో భారీ ఆశలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. మొదటి రోజే భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉన్న OG సినిమా, బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఇది పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

Advertisment
తాజా కథనాలు