OG OTT Date: OG ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

పవన్ కళ్యాణ్ ‘OG’ అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో భారీ హిట్‌గా నిలిచి రూ. 310 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగు సహా ఐదు భాషల్లో డిజిటల్‌గా విడుదలకానున్న OG, ఓటీటీలోనూ సెన్సేషన్ చేయనుంది.

New Update
OG Trailer Update

OG OTT Update

OG OTT Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "OG (They Call Him OG)" ఈ ఏడాది టాలీవుడ్‌ను షేక్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

OG Worldwide Collections

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 154 కోట్ల గ్రాస్ వసూలు చేసిన OG, ఇప్పటివరకు దాదాపు రూ. 310 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించారు. వీరితో పాటు నేహా శెట్టి, శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, హరిశ్ ఉతమన్, సుధేవ్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: ప్రతీ సీన్‌ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

OG Streaming on Netflix

ఈ థియేటర్ సక్సెస్ తర్వాత, OG ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు ముందే OG డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను అక్టోబర్ 23 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదలై 28 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తుండటంతో, థియేటర్ లవర్స్ కు, ఓటీటీ వీక్షకులకు బెనిఫిట్‌గా మారింది. OG సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

OGకి తమన్ ఎస్ ఎస్ అందించిన మ్యూజిక్, సుజీత్ తీసిన గ్రాండియర్ విజువల్స్, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. యాక్షన్, ఎమోషన్, డ్రామా మిక్స్‌తో ఈ సినిమా ఫ్యాన్స్‌ని బాగా ఎంగేజ్ చేసింది. OG స్టోరీ టెల్లింగ్ కి మంచి మార్కులు పడ్డాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం, OG మూవీపై సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ప్లాన్ కూడా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ హింట్ ఇచ్చారు. OG యూనివర్స్‌ని విస్తరించేందుకు కసరత్తులు మొదలయ్యాయని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

మొత్తంగా చూస్తే, థియేటర్‌లో సంచలనం సృష్టించిన OG, ఇప్పుడు ఓటీటీ లోనూ అదే క్రేజ్‌ను కొనసాగించేందుకు రెడీగా ఉంది. పవన్ ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ సినిమాల అభిమానులు ఈ స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు