/rtv/media/media_files/2025/09/24/og-nizam-record-2025-09-24-18-42-14.jpg)
OG Nizam Record
OG Nizam Record: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాస్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి చాల కాలమే అయ్యింది. జనాల పవన్ నుండి ఒక మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే OG సినిమా వచ్చేసింది.ఇప్పటికే OG పై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పుడు OG (They Call Him OG) సినిమాతో పవన్ మళ్లీ ఫుల్ ఫారంలోకి వచ్చాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ హవా (OG Advance Bookings)
OG ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్, థమన్ ఇచ్చిన మ్యూజిక్, సుజీత్ గ్యాంగ్‌స్టర్ టచ్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్‌కి చేరింది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లోనే దుమ్ము దులిపేస్తున్నాయి.
#OG is all set to register a 25 Cr+ Gross opening and Even Bigger from Hyderabad City alone (including premieres). With positive WOM, Nizam is expected to target a minimum of 40 Cr+ Gross (All-Time Record) start#TheycallHimOG#PawanKalyan
— TrackTollywood (@TrackTwood) September 24, 2025
నైజాంలో మాస్ ర్యాంపేజ్! (OG Nizam Record)
నైజాం ప్రాంతం అంటే పవన్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. OG సినిమా ఈ జోన్‌లో భారీగా ఓపెనింగ్ సాధించనుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం, OG సినిమా ఓపెనింగ్ డే (పెయిడ్ ప్రీమియర్స్ కలుపుకొని) నైజాంలో దాదాపు రూ. 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టే అవకాశముందని చెబుతున్నారు.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
ఇప్పటివరకు నైజాం ప్రాంతంలో ఓపెనింగ్ డే రికార్డు పుష్ప 2: ది రూల్ (అల్లు అర్జున్) మీద ఉంది. OGకి పాజిటివ్ టాక్ వస్తే, ఆ రికార్డు కూడా తేలికగా బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు.
OG మూవీ విశేషాలు
ఈ యాక్షన్ ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. DVV దానయ్య - కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే బీజీఎమ్ అందించారు.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అలాగే ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
OG సినిమా నైజాంలోనే కాదు, ఇతర ఏరియాల్లోనూ మంచి బిజినెస్ చేస్తోంది. అయితే నైజాం మార్కెట్ నుంచి భారీ వసూళ్లు రావడం ఖాయమన్న విశ్వాసం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనర్ అయ్యే అవకాశాలున్నాయి. చూడాలి OG థియేటర్లలో ఎలా రచ్చ చేస్తుందో!