OG Day 1 Gross: ‘OG’ దుమ్ము రేపిన ఫస్ట్ డే కలెక్షన్స్.. కళ్యాణ్ బాబు కల్ట్ చూపించారుగా..!

పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా తొలి రోజే రూ.154 కోట్లు వసూలు చేసి, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా, ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌తో, వీకెండ్ బుకింగ్స్ లో దుమ్ము దులుపుతోంది.

New Update
OG Day 1 Gross

OG Day 1 Gross

OG Day 1 Gross: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ 'OG' బాక్సాఫీస్‌(OG Box Ofice Collections) వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన తొలి రోజు వసూళ్లను సాధించింది. విడుదలైన రోజే ఈ సినిమా, పవన్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు టచ్ చేయని అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది.

Also Read :  ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే

రూ.154 కోట్ల గ్రాస్..

నిర్మాతలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, OG తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది పవన్ కళ్యాణ్‌ గత హయ్యెస్ట్ ఓపెనింగ్ అయిన హరి హర వీర మల్లుకి రెండింతలుగా ఉండటం విశేషం. అంతేకాదు, రజినీకాంత్ - లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన కూలీ సినిమా ఓపెనింగ్‌ని కూడా ఇది దాటి పోయింది.

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్  బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ రోల్‌ చేయగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించారు. ప్రియాంకా మోహన్ కథానాయికగా నటించారు. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ లో సగం వసూలు కావడం సినిమాకి మంచి ప్రారంభాన్ని అందించింది. వీకెండ్ రోజుల్లో ఇంకెంత రాబడి వస్తుందో చూడాలి!

ఈ సినిమాను దీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి నిర్మించారు. ఇందులో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, ఉపేంద్ర లిమాయే, సుభలేఖ సుధాకర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని ఎస్.ఎస్. తమన్ అందించగా, ఆయన ఇచ్చిన పాటలు, BGM సినిమాకు బలంగా నిలిచాయి.

Also Read: సుజీత్ డ్రీమ్.. SCUతో పవన్, ప్రభాస్ కలిసేనా?

ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఇన్నేళ్లుగా ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలానే ప్రెసెంట్ చేసారు డైరెక్టర్ సుజీత్. సినిమాలో మంచి కథ, కథనాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో పాటు, పవన్ స్టైల్‌ అండ్ స్వాగ్ కి బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తానికి, పవన్ కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా OG నిలిచేలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు