Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం స్వయంగా వెల్లడించారు. షూటింగ్ చివరి షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పాల్గొని తన షూటింగ్ భాగాన్ని పూర్తి చేశారు.
సోషల్ మీడియా వేదికగా నిర్మాత తన ఆనందాన్ని పంచుకుంటూ.. “చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లలో కలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన పాటలు, పవర్‌ఫుల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నాం,” అని వెల్లడించారు.
Also Read: 2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?
త్వరలోనే విడుదల తేదీ..
ఈ చిత్రం మొదటి నుంచి అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. గతంలో మే 9 విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, షూటింగ్ పెండింగ్ ఉండటంతో విడుదలను మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. తాజా విడుదల తేదీని(Hari Hara Veera Mallu Release Date) త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. డబ్బింగ్, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జోరుగా కొనసాగుతోంది.
Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే
ఈ చిత్రానికి తొలుత దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి పని చేయగా, తరువాత బాధ్యతలను నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ స్వీకరించారు. ఇందులో చారిత్రాత్మక యోధుడిగా ఓ విభిన్నమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.