Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్' టైటిల్ కోసం.. కొట్టుకుంటున్న నిర్మాతలు!

'ఆపరేషన్ సింధూర్' టైటిల్ కోసం బాలీవుడ్ లోని బాలీవుడ్ లోని పలు  ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లు పోటీ పడుతున్నాయి. సుమారు 15 మంది నిర్మాతలు ఈ టైటిల్ కోసం IMPPA  (ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్)  లో దరఖాస్తు చేసినట్లు సమాచారం.

New Update
Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: ఈ మధ్య  చాలా మంది దర్శక, నిర్మాతల  యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను రూపొందించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  చారిత్రాత్మక సంఘటనలు, స్వాతంత్య్ర సమరయోధుల కథలను సినిమా రూపంలో భవిష్యత్తు తరాలకు చూపిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే విడుదలైన పలు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఉదాహరణకు: Uri: The Surgical Strike,   Fighter, War, ఛావా వంటి సినిమాలు. 

టైటిల్ కోసం పోటీ.. 

ఇప్పుడు  'ఆపరేషన్ సింధూర్' సంఘటన ఆధారంగా కూడా ఓ యుద్ధ నేపథ్య చిత్రం రూపొందించేందుకు ఉత్సాహంగా ఉన్నారు నిర్మాతలు. ‘Operation Sindoor’ టైటిల్ ని రిజిస్టర్ చేసుకోవడానికి పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సుమారు 15 మంది నిర్మాతలు ఈ టైటిల్ కోసం IMPPA  (ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్) లో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. టీ సీరీస్, జీ స్థూడియోస్, మధుర్ భండార్కర్, వంటి ప్రముఖ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. మరి ఇందులో ఏ సంస్థకు టైటిల్ రైట్స్ సొంతం అవుతాయో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాలి. 

యుద్ధ నేపథ్య చిత్రాలు Uri: ది సర్జికల్ స్ట్రైక్ ,  ఫైటర్, వార్ వంటి సూపర్ హిట్స్ తర్వాత.. ఈ తరహా సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. అందుకే చిత్ర నిర్మాతలు 'Operation Sindoor' టైటిల్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే కాలంలో ఇదొక భారీ సినిమా కావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా తీసినా.. తీయకపోయినా ముందుగానే  టైటిల్  రిజిస్టర్ చేసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుందని నిర్మాతల ఆలోచన. 

latest-news | telugu-news | cinema-news | operation sindoor title | bollywood

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు