/rtv/media/media_files/2025/09/19/og-premier-shows-2025-09-19-13-52-26.jpg)
OG Premier Shows
OG Premier Shows:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ OG (They Call Him OG) ఈ నెల సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో "హరిహర వీరమల్లు"లో అభిమానులు నిరాశకు గురైన నేపధ్యంలో, ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ పని చేయగా, ఇప్పటికే విడుదలైన సాంగ్స్, బీజీఎమ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన OG, ఊహించని రేంజ్ హైప్ క్రియేట్ చేసింది.
ఇక సినిమా విడుదలకు కేవలం వారం రోజులే మిగిలిన నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ పెంచారు. అందులో భాగంగా సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌తో సినిమా ప్రమోషన్ మరింత ఊపందుకోవడం ఖాయం.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
అంతేకాకుండా, OG సినిమాను విడుదలకు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 24న ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షోలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.1000 టికెట్ ధరకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ టికెట్ రేట్లు సామాన్య ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటికే గుంటూరులో కొన్ని థియేటర్లలో ప్రీమియర్ షోలు ప్లాన్ అవుతున్నాయి. అయితే నైజాం ఏరియాలో ప్రీమియర్ షోలు జరగాలా వద్దా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల నైజాంలో బెన్‌ఫిట్ షోలపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
ఇక సినిమా రిలీజ్ రోజు తెల్లవారుజామున 1 గంట, 4 గంటల షోలు ఉంటాయా? అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. దీనిపై ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉంది. మొత్తానికి పవన్ కల్యాణ్ OG హవా ముందే స్టార్ట్ అయింది. షోలు, టికెట్ రేట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా చుట్టూ హైప్ ఇంకా పెరుగుతోంది.