NTR-Neel Update: కర్ణాటకలో ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ షురూ.. ఫ్యాన్స్‌కి పూనకాలే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా షెడ్యూల్‌ కోసం కర్ణాటక చేరుకున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి ‘డ్రాగన్’అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

New Update
NTR Neel

NTR Neel

NTR-Neel Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాజా సినిమా షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం ఉదయం కర్ణాటకకు పయనమైనట్టు సమాచారం. మంగళవారం నుంచి అధికారికంగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఎన్టీఆర్ ఆ రోజు నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఆ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేని సీన్లను పూర్తి చేశారు.

Also Read: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో

ఇప్పుడు కర్ణాటకలో జరగనున్న తాజా షెడ్యూల్‌లో తారక్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ భాగంలో ఎన్టీఆర్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.

Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది.

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఈ భారీ బడ్జెట్ సినిమాను నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు కలిసి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, కెమెరామెన్‌గా భువన్ గౌడ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను చలపతి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులూ, సినీ ప్రేమికులూ ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అధికారిక అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు