War 2: హృతిక్, ఎన్టీఆర్ 'వార్ 2' ముగిసింది.. సెట్ లో సెలబ్రేషన్ పిక్ వైరల్

హృతిక్ రోషన్,  జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇద్దరు స్టార్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

New Update

War 2:  హృతిక్ రోషన్,  జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇద్దరు స్టార్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. చిత్ర బృందానికి,  దర్శకుడు అయాన్ ముఖర్జీకి భావోద్వేగ సందేశాలను పంపారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెట్ లో కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

హృతిక్ పోస్ట్

 ఈ మేరకు హృతిక్ తన ఎక్స్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు. 149 రోజులపాటు సాగిన ఈ చిత్రీకరణలో చేజింగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్సులు, రక్తం, చెమట, గాయాలు!  ఇవన్నీ ఉన్నప్పటికీ, ప్రతి క్షణం విలువైనదే అని  అన్నారు. అలాగే ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  ''మీతో కలిసి పనిచేయడం, ఇంత ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించడం ఒక గౌరవం'' అని అన్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ అద్భుతమైన సినిమాటిక్ విజన్‌ను ప్రజలందరూ చూసే వరకు వేచి ఉండలేకపోతున్నాను అంటూ ప్రశంసలు కురిపించారు. 

వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.  అంతేకాదు వీరిద్దరి  మధ్య యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. 

Also Read : Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు