Ntr Devara :
ప్లీజ్ సర్.. మా అబ్బాయిని బతికించండి.. సెప్టెంబర్ 27 వరకైనా బతికించండి..’ ఇది ఓ జూనియర్ అభిమాని తల్లి బాధ.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో హృదయాన్ని కలిచివేస్తోంది. చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడ్డ తన కొడుకు చివరి కోరిక తీర్చాలని ఆ తల్లి మీడియా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఆ యువకుడి వద్దకు వెళ్లి వివరాలు సేకరించింది. కౌశిక్ అకౌంట్ నంబర్ 41529226922, SBI, IFC: SBIN0020926 ను డబ్బుల పంపించి తన కొడుకును కాపాడాలని బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
‘దేవర’ సినిమా చూసేవరకు నన్ను బతికించండి
‘దేవర’ సినిమా చూసేవరకు తనను బ్రతికించండి అని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్(19) బ్లడ్ క్యాన్సర్ తో బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక తాను బతకనని.. దేవర రిలీజ్ సెప్టెంబర్ 27 వరకైనా బతికించండని వైద్యులను వేడుకుంటున్నాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైనా కౌశిక్ తల్లిదండ్రులు.. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని అతని తల్లిదండ్రులు ఎన్టీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమా హీరోలను దేవుళ్లగా చూసే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ముందువరుసలో ఉంటాయి. ఇటు టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు ఫ్యాన్స్ లేరు..భక్తులే ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తారక్‌కు కూడా ఫ్యాన్స్‌ని ఎంతో గౌరవిస్తారు.. తన ఫ్యాన్స్ ఆపదలో ఉన్నప్పుడు గతంలో అనేకసార్లు జూనియర్ వారికి హెల్ప్ చేశారు. అలానే ఈ అబ్బాయికి కూడా తారక్ అండగా నిలుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు ఇటివలీ కాలంలో క్యాన్సర్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో యువత కూడా ఎక్కువగా ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. మనం తింటున్న ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు జెనిటిక్పరంగానూ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
Also Read: Devara Trailer: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘దేవర’ ట్రైలర్.. 24గంటల్లోనే అన్ని మిలియన్ల వ్యూస్..!