Devara : ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు ఏపీ హైకోర్టు షాక్..!

ఎన్టీఆర్ 'దేవర' సినిమా విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల వరకు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పిల్ దాఖలు చేయగా.. 10రోజులకే మాత్రమే పరిమితం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

DEVARA

DEVARA

New Update

Devara :  ప్రస్తుతం నెట్టింట 'దేవర' ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'దేవర' సినిమా పాటలు, ప్రమోషనల్ వీడియోలే కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆరేళ్ళ తర్వాత వస్తున్న తారక్ సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 'దేవర' స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి. 

'దేవర' 14 రోజుల టికెట్ ధరల పెంపుపై పిల్ దాఖలు 

ఈ క్రమంలో తాజాగా 'దేవర' మేకర్స్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఏపీ హైకోర్టులో 'దేవర' టికెట్ ధరల పెంపు పై పిటీషన్ దాఖలైంది. అయితే టికెట్ ధరల పెంపునకు 10 రోజులు మాత్రమే అనుమతి ఉండగా.. ప్రభుత్వం 14 రోజులు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఓ పిటీషనర్ ఏపీ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరల పెంపును పది రోజులు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read :  15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

#tollywood #janhvi-kapoor #jr-ntr #devara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe