/rtv/media/media_files/2025/09/29/ntr-kantara-event-2025-09-29-07-56-20.jpg)
NTR Kantara Event
NTR Kantara Event: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు(Kantara Telugu Event) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ అక్టోబర్ 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగం అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, “నాకు 3 ఏళ్లు ఉండగా నానమ్మ చెప్పిన ఎన్నో జానపద కథలు గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో మా ఊరు కుందాపురకు దగ్గరగా ఉందని చెప్పారు. ఆ కథల్లో పంజుర్లి గురించిన విషయాలు ఉండేవి. ఆ కథలు నిజమా అనిపించేది. ఇప్పుడు ఆ చిన్నప్పటి కథలు స్క్రీన్ మీద చూడటం వింతగా, ఇష్టంగా అనిపించింది. ఈ అనుభూతిని ఇచ్చిన నా స్నేహితుడు, అన్న రిషబ్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు,” అన్నారు.
నాకు కొంచెం నొప్పిగా ఉంది' జూనియర్ ఎన్టీఆర్ ను మీరు ఎప్పుడూ ఇలా చూసి ఉండరు ! | Junior NTR Speech @ Kantara Chapter 1 Pre Release Event #rishabshetty#JuniorNTR#Pain#Inconvenience#kantarachapter1Prereleaseevent#kantarachapter1#PrereleaseEvent#Sandalwood#FilmUpdatespic.twitter.com/L3q4T9uAQ2
— Vanitha TV (@VanithaTvOnline) September 28, 2025
రిషబ్ అసాధారణ నటుడు..
రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు, ఆయనను ఎంతో ప్రత్యేకంగా అభివర్ణించారు. “రిషబ్ ఒక అసాధారణ నటుడు, గొప్ప దర్శకుడు. ఆయనలోని నటుడు, దర్శకుడుకి సినిమాలోని 24 విభాగాలపైనా పూర్తి పట్టు ఉంది. ఈ కథను ఎవరూ తెరకెక్కించలేరు, కేవలం రిషబ్ మాత్రమే చేయగలడు,” అన్నారు ఎన్టీఆర్.
Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్
ఇంకా మాట్లాడుతూ, “నా అమ్మ కోరికతో ఉడుపి శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించాను. మల్లి ఇప్పుడు రిషబ్ వల్లే సాధ్యమైంది. ఆయన నన్ను తన కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి,” అని అన్నారు. ఎన్టీఆర్ స్పీచ్ ప్రారంభంలో, “ఇటీవల గాయపడిన కారణంగా ఎనర్జీతో మాట్లాడలేకపోతున్నాను. అభిమానులు క్షమించాలి,” అంటూ చెప్పారు.
Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్
ఈ సినిమాకి విజయ్ కిరగందూర్ నిర్మాణ బాధ్యతలు వహించారు. ఈ చిత్రం కేవలం వినోదం కోసం కాకుండా, మన సంస్కృతిని, మూలాల్ని తెరపై చూపించే ప్రయత్నం. కాంతారా చాప్టర్ 1 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ మాటలతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. రిషబ్ శెట్టి ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల చేయడం ఖాయంగా కనిపిస్తోంది