Taraka Rama Rao: NTR ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో ఎంట్రీ.. కొత్త సినిమా ప్రారంభం

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు తారక రామారావు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టి నటీనటులను అభినందించారు.

New Update
nandamuri family new hero ntr yvs chowdary new movie opening

nandamuri family new hero ntr yvs chowdary new movie opening

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా రాబోతోన్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో కొత్త సినిమాను ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది. 

NTR కొత్త సినిమా

సోమవారం NTR ఘాట్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భువనేశ్వరి, లోకేశ్వరి, పురందేశ్వరిలతో పాటు ఎన్టీఆర్‌ ఫ్యామిలీ సభ్యులు అటెండ్ అయ్యారు. ఈ మేరకు నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టి నటీనటులను అభినందించారు. ఈ చిత్రాన్ని యలమంచలి గీతా ఎన్టీఆర్ (న్యూ టాలెంట్ రోర్స్) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా కోసం వెతికి వెతికి ఒక అచ్చమైన తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. వీనా రావు అనే అమ్మాయి ఈ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. హీరో హీరోయిన్లు ట్రెడిషనల్ లుక్‌లో ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే జానకి రామ్ కొడుకు నందమూరి తారకరామారావు సినిమాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.  

telugu-news | nandamuri-taraka-ramarao | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు