Nivetha Pethuraj : ముస్లిం వ్యక్తితో నటి నివేతా పేతురాజ్ పెళ్లి.. ఎప్పుడంటే?

నటి నివేతా పేతురాజ్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బిజినెస్ మెన్ రాజ్ హిత్ ఇబ్రాన్ ను ఆమె పెళ్లాడనుంది. ఈ జోడి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఏడాదిలోనే వీరిద్దరి పెళ్లి జరగనుందిని సమాచారం.

New Update
nivetha

నటి నివేతా పేతురాజ్ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. బిజినెస్ మెన్ రాజ్ హిత్ ఇబ్రాన్ ను ఆమె పెళ్లాడనుంది. నివేతా పేతురాజ్ నిన్న రాత్రి తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలు లో వైరల్ గా మారాయి.ఈ ఏడాదిలోనే వీరిద్దరి పెళ్లి జరుగుతుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా గోప్యంగా జరగనుందని  తెలుస్తోంది. మధురైలో పుట్టి పెరిగిన నివేతా పేతురాజ్ కొన్ని సంవత్సరాల క్రితం తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో స్థిరపడ్డారు. నివేదా పేతురాజ్ కు కార్ రేసింగ్ పై కూడా ఆసక్తి ఉండేది. ఈ సందర్భంలో ఆమెకు ఇబ్రాన్ తో  పరిచయం ఏర్పడింది, అది కాస్త ప్రేమగా మారింది. 


నివేతా పెతురాజ్ 2016లో విడుదలైన 'ఊరందు కూతు' సినిమాతో తమిళ సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. నవంబర్ 30, 1991న జన్మించిన నివేతా పెతురాజ్ వయసు 34 సంవత్సరాలు. ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి 'ఎమ్మానాస్ తంగం' చిత్రంలో తన పాత్ర ద్వారా ఆమె బాగా గుర్తింపు పొందింది.  రవి మోహన్‌తో కలిసి 'టిక్ టిక్ టిక్', విజయ్ ఆంటోనీతో కలిసి 'తిమిరు పుటిచవన్', విజయ్ సేతుపతితో కలిసి 'సంగతమిజ్', ప్రభుదేవాతో కలిసి 'పొన్మాణికవేల్' వంటి తమిళ చిత్రాల్లో నటించింది. 

Also Read :  Telangana Heavy Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు.. 25 జిల్లాలకు బిగ్ అలర్ట్.. డేంజర్ జోన్‌లో ఈ 11 జిల్లాలు!

మెంటల్ మదిలో సినిమాతో

నివేదా పేతురాజ్ మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.  ఆ తరువాత చిత్రలహరి, బ్రోచేవారెవరు రా, రెడ్, పాగల్‌విరాట పర్వం,  అలా వైకుంఠపురములో వంటి చిత్రాలలో కూడా కనిపించింది. వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. గత సంవత్సరం విడుదలైన 'బారు' అనే వెబ్ సిరీస్ తర్వాత ఆమె ఏ పెద్ద చిత్రాలకు కమిట్ కాలేదు. నివేత చివరిసారిగా తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించింది.  కాగా రాజ్‌హిత్ హాస్పిటాలిటీ పరిశ్రమలో పనిచేస్తూ దుబాయ్‌లో స్థిరపడ్డాడు.  

Also Read :  September Bank Holidays : సెప్టెంబర్ లో 15 రోజులు బ్యాంకులు బందే.. లిస్టు ఇదే!

Advertisment
తాజా కథనాలు