గ్లామర్ రోల్స్ కి ఆమడ దూరంలో ఉంటూ హోమ్లీ రోల్స్ లో నటించి తన సహజ నటనతో సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది నిత్యా మీనన్. యంగ్ స్టర్స్ తో పాటూ స్టార్ హీరోలతోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అసలు సినిమాలే చేయనంటోంది.
పూర్తి వివరాల్లోకీ వెళ్తే నిత్యా మీనన్ నటించిన లేటెస్ట్ కోలీవుడ్ మూవీ 'కాదలిక్క నెరమిళ్లై'. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "పాడటం, డ్యాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం ఇవన్నీ చిన్ననాటి నుంచే మా అమ్మ నాతో చేయించింది. నిజం చెప్పాలంటే, నాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.
Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!
అయినప్పటికీ, అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి కొనసాగిపోయాను. ప్రతి సారి సినిమాలు వదిలేయాలని అనుకున్నప్పుడు ఏదో ఒకటి అడ్డంకిగా మారింది. ఇటీవల, నేను ఇకపై సైలెంట్ గా సినిమాలు మానేస్తానని అనుకున్న సమయంలోనే 'తిరుచిత్రంపళం' చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడే నాకు ఒక విషయం స్పష్టమైంది. నేను సినిమాలు మానేస్తే, సినిమా మాత్రం నన్ను వదిలిపెట్టదు.
ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను. నాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయటకు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. పార్కులో నడవాలని అనిపించినా, అది సాధ్యం కాదు. ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. పైలట్ అవ్వాలని చిన్ననాటి నుంచి కల. ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి.." అని చెప్పింది.
Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి