Nithiin Thammudu Movie: నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "తమ్ముడు" విడుదల తేదీని మేకర్స్ మార్చారు. మొదటగా జూలై 4, 2025న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు జూలై 24, 2025న విడుదల కానుందట ఈ మార్పు వెనుక కారణం "కింగ్‌డమ్" సినిమా అని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. దర్శకత్వం వేణు శ్రీరామ్ "వకీల్ సాబ్", "మా" వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్. సంగీతాన్ని "కాంతారా" చిత్రంతో గుర్తింపు పొందిన కర్ణాటకకు చెందిన అజనీష్ లోకనాథ్ అందిస్తున్నారు. కథానాయికగా "కాంతారా" మూవీతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సప్తమి గౌడ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లయ, వర్షా బొల్లమ్మ, లుబ్బర్ పందు ఫేమ్ స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక కథ విషయానికొస్తే
"తమ్ముడు" ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్, తన చెల్లిని కాపాడే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు.
Also Read: ఈ రేంజ్ కలెక్షన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా! #సింగిల్ వరల్డ్ వైడ్ ఎంతంటే..?
తాజాగా, మూవీ టీమ్ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ లను పరిచయం చేసే ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేసింది. నితిన్ గత చిత్రం రాబిన్ హుడ్ ప్లాప్ కావడంతో "తమ్ముడు" నితిన్ కెరీర్‌కు కీలకమైనది, కాబట్టి మేకర్స్ విడుదల తేదీని జూలై 24కు మార్చడం ద్వారా విజయ్ 'కింగ్‌డమ్'తో క్లాష్ లేకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.
Also Read: బాలయ్య కొత్త ఆయుధం రెడీ.. ఇక దబిడి దిబిడే..!