/rtv/media/media_files/2025/02/24/wjmHGw46NN2COG6OuA1Z.jpg)
mega daughter Niharika
Niharika: మెగా డాటర్ నిహారిక ఓ వైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు తీస్తూ మరోవైపు సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో కూడా తరచూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది. అయితే ఇటీవలే నిహారిక ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. నేను అతడిని ప్రేమిస్తున్నాను.. అంబటి భార్గవి దయచేసి నువ్వు మా ఇద్దరి మధ్య అడ్డుగోడలా ఉండొద్దు. మా ఇద్దరి స్నేహం మధ్యలో రావొద్దు అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ ఎవరి కోసమా ? అని చూడగా.. నిహారిక ఫ్రెండ్ అంబటి భార్గవి కుమారుడు కోసం పెట్టింది. ఎప్పుడూ సరదా సరదాగా కనిపించే నిహారికకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. అలా తన ఫ్రెండ్ కుమారుడి పై ఇష్టాన్ని తెలియజేస్తూ స్టోరీ పెట్టింది.
Also Read: Kurchi Madathapetti: 'కుర్చీ మడతపెట్టి' పాటకు యమ క్రేజ్.. నేపాల్ వీధుల్లో దుమ్మురేపిన అమ్మాయిలు! వీడియో వైరల్
'విశ్వంభర' లో స్పెషల్ రోల్
ఇది ఇలా ఉంటే నిహారిక మెగాస్టార్ 'విశ్వంభర' చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే నిహారిక, సాయి ధరమ్ తేజ్ సాంగ్ షూట్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా రెండు, మూడు చిత్రాలు చేసిన తర్వాత.. మళ్ళీ వెబ్ సీరీస్ లలో నటించింది. ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇటీవలే నిహారిక ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లను రాబట్టింది. నిహారిక రీసెంట్ గా 'మద్రాస్ కరణ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది జనవరిలో ఈ చిత్రం విడుదలైంది.