ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయిడు భార్య, బాలయ్య సోదరి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఈ రోజు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలా విషయాలపై మాట్లాడారు. బాలయ్య నా తమ్ముడు కాదు.. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతూ . డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తోందని, వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తన సోదరుడు బాలకృష్ణ గురించి మాట్లాడుతూ..' బాలకృష్ణ తనకు తమ్ముడని అందరూ అనుకుంటారని.. కానీ, తన కన్నా బాలకృష్ణ రెండేళ్లు పెద్దవారని తెలిపారు. నేనూ తమ్ముడు అనుకున్నాను భువనమ్మ 😃😃మా బాలయ్య బంగారం 🥰🥰 pic.twitter.com/4r2ADbEhI0 — Geetha vijaya ™️ 😍✌️ (@geetha_happy2) December 19, 2024 Also Read : 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే తాను సినిమాలు తక్కువగా చూస్తానని, తనకు బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండ సినిమాలు బాగా నచ్చాయి అని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులు కోరిక మేరకు "ఒకవైపే చూడు మరోవైపు చూడకు.." అంటూ బాలయ్య డైలాగ్ ను తన డైన స్టైల్లో చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Also Read: కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి.. సూసైడ్ చేసుకున్న సింగర్ శృతి కన్నీటి కథ!