Nani:సినిమాల్లో నిజంగానే పవర్ స్టార్.. కానీ రాజకీయాల్లో మాత్రం? : నాని

రానా దగ్గుబాటి టాక్ షోలో పాల్గొన్న న్యాచురల్ స్టార్ నాని.. పవన్‌ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ స్టార్‌గా ఎలా ఎదిగారో నాకు తెలుసు. రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌స్టార్‌ అని నిరూపించుకున్నారని చెప్పాడు.

New Update
nani (1)

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అభిమానించే హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్‌కు మద్దతుగా  పోస్ట్ పెట్టి తన అభిమానాన్ని చాటుకున్న నాని మరోసారి డిప్యూటీ సీఎం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దగ్గుబాటి రానా హోస్ట్ గా చేస్తున్న టాక్ షోలో పాల్గొన్న నాని.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్‌ స్టారే అని అన్నారు.

ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా

Also Read : బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!

ఎంతోమందికి స్ఫూర్తి..

' సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ స్టార్‌గా ఎలా ఎదిగారో తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌స్టార్‌ అని నిరూపించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు’ అని నాని అన్నారు. ఈ కామెంట్స్‌పై రానా స్పందిస్తూ.. పవన్‌ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ఆయన నిజంగానే సూపర్‌ స్టార్‌ అని.. రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయని అన్నారు. 

ఇది కూడా చదవండి:  ఖాళీ కడుపుతో ఈ కషాయం తాగితే మీ గుండె సేఫ్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో ఓ టాక్‌ షో ప్రసారం కానుంది. నవంబర్ 23 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ టాక్ షోలో నానితో పాటూ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డ, తేజా సజ్జా, శ్రీలీల తదితరులు గెస్టులుగా రానున్నారు. 

ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు