/rtv/media/media_files/2025/04/21/vxtt5OAdxDihc7Gkl5FN.jpg)
Akhanda 2
Akhanda 2: నందమూరి బాలకృష్ణ(Balakrishna)- బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్‌లో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అఖండ 2' చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం గురించి అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా విడుదల(Akhanda 2 Release Date) కొంత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.
Also Read: మోహన్‌లాల్‌తో మాళవిక ‘హృదయపూర్వం’..
మొదట్లో ఈ సినిమాను సెప్టెంబర్లోనే థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాకపోవడం, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు కూడా అనుకున్న టైమ్ లోపు పూర్తయ్యేలాగా లేకపోవడంతో సినిమాను 2026 సంక్రాంతికి వాయిదా వేసే యోచనలో చిత్రబృందం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలయ్య అభిమానులు మాత్రం అఖండ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కీలక పాత్రలో విజయశాంతి..
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఒక రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపించనున్నారని వార్త సినీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ఓటీటీ రైట్స్ విషయంలోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం పోటీపడుతున్నాయట. కోట్ల రూపాయల బిడ్డింగ్ జరుగుతోందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇటీవల డిజిటల్‌లో విడుదలైన డాకు మహారాజ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా దీనికి ఓ కారణం.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సంగీత దర్శకుడిగా ఎస్‌ఎస్ తమన్ పని చేస్తున్నారు. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలన్నీ భారీ విజయం సాధించాయి. ముఖ్యంగా 'అఖండ' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, దానికి కొనసాగింపుగా ఈ సీక్వెల్‌ను పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి 'అఖండ 2' ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..