/rtv/media/media_files/2025/10/13/dil-raju-og-2025-10-13-12-17-35.jpg)
Pawan Kalyan OG
Dil Raju OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన 'They Call Him OG' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రత్యేకించి నైజాం ప్రాంతంలో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ నిర్మాతలకు భారీ లాభాల్ని అందిస్తోంది. ఈ సినిమా విజయం ఒక్క నిర్మాతలకే కాదు, అభిమానులకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
Also Read: "మన శంకర వరప్రసాద్ గారు" క్రేజీ అప్‌డేట్.. పండక్కి ఇంక రచ్చ రచ్చే..!
OG లాభాల పంట!
ఈ సినిమాను దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులతో రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా రూ. 50 కోట్లు బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటి లాభాల్లోకి వెళ్లింది. దాంతో, OG టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు దిల్ రాజు ప్రత్యేకంగా ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌పై దిల్ రాజు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: 'దేవర పార్ట్ 1' టీవీ టెలికాస్ట్ రెడీ - పూర్తి వివరాలు ఇవే!
“OG నాకు కొత్త ఎనర్జీ ఇచ్చింది. చాలా రోజులుగా నేను ఈ తరహా ఎనర్జీ కోరుకుంటున్నాను. నాకే కాదు OG స్క్రీన్ మీద ఫ్యాన్స్‌కు కూడా ఎనర్జీ ఇచ్చింది... కల్లెక్షన్స్ రూపంలో నాకు ఎనర్జీ ఇచ్చింది. నైజాం కా బాద్‌షా పవన్ కళ్యాణ్ గారు!” అంటూ పొగిడారు. ఈ మాటలతో పవన్ అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.
Also Read: "మిత్ర మండలి" స్పెషల్ ప్రీమియర్ షోలు.. ఇదిగో ఫుల్ డిటైల్స్
దిల్ రాజు - పవన్ కళ్యాణ్ కాంబో..
ఇప్పటికే వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రంలో కలిసి పనిచేసిన ఈ కాంబో, త్వరలో మరోసారి కలవనున్నారు. దిల్ రాజు ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన రాజకీయ, సినిమాల షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారని, అయితే పవన్ డేట్స్ వస్తే ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని తెలిపారు.
'OG' సినిమాతో పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో OG మాస్ యాపీల్, కథనం, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫ్యూచర్‌లో దిల్ రాజు - పవన్ కలయికలో రానున్న సినిమా మీద మరింత అంచనాలు మొదలయ్యాయి. ఫ్యాన్స్ మళ్లీ మాస్ ఫెస్టివల్ కోసం రెడీ అవుతున్నారు!
Follow Us