/rtv/media/media_files/2025/09/20/shiva-4k-re-release-2025-09-20-12-32-19.jpg)
Shiva 4k Re Release
Shiva 4k Re Release:
తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'శివ' సినిమా మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి సిద్ధమవుతోంది. 1989లో నాగార్జున(Nagarjuna), రామ్ గోపాల్(Ram Gopal Varma) వర్మ కాంబినేషన్‌లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ ఇప్పుడు సరికొత్త అవతారంలో 4K డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో రీ-రిలీజ్ కాబోతుంది.
On my dear father ANR ‘s birthday, I am pleased to announce the film that shook Indian cinema is coming back to shake the theaters again ❤️🔥
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2025
@AnnapurnaStdios and @RGVzoomin's PATH BREAKING FILM #SHIVA Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025 💥
Experience the cult… pic.twitter.com/VE5HVyo6Pf
ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారి 101వ జయంతి సందర్భంగా, ఆయన తనయుడు నాగార్జున ఈ విశేషాన్ని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 14న ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. నాగార్జున మాట్లాడుతూ, "నా నాన్నగారు సినిమాలు తరతరాల పాటు జీవించాలి అనే విశ్వాసంతో ఉండేవారు. అందుకు 'శివ' సినిమా ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు ఈ సినిమాను అత్యాధునిక టెక్నాలజీతో మళ్లీ తెరపైకి తీసుకురావడం ఆయన కలకు నివాళిగా భావిస్తున్నాను" అని తెలిపారు.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఇప్పటి వరకూ ఏ రీ-రిలీజ్ సాధించని విధంగా, ‘శివ’ చిత్రానికి ప్రత్యేకమైన సౌండ్ ప్రాసెసింగ్ చేశారు. ప్రాచీన మోనో ఆడియోను ఆధునిక AI టెక్నాలజీ ద్వారా డాల్బీ ఆట్మాస్‌కి మార్చడం ద్వారా, ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, "ఇంతకుముందు ఎప్పుడూ విననటువంటి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్రేక్షకులకు లభించబోతోంది. ఆ మాయాజాలాన్ని మీరంతా థియేటర్లలో ఆస్వాదించాల్సిందే" అన్నారు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, సురేంద్ర యర్లగడ్డ ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా కథ, టేకింగ్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ భారత సినిమా స్థాయిని మారుస్తూ "Before Shiva - After Shiva" అనే విధంగా పేరు పొందింది. ఈ రీ-రిలీజ్‌తో ఆ ఘనతను మరోసారి గుర్తు చేస్తూ, కొత్త తరం ప్రేక్షకులకు ‘శివ’ మళ్లీ ఓ అద్భుత అనుభవాన్ని అందించనుంది.