Nagarjuna : నాగార్జున - కొండా సురేఖ కేసులో మరో కీలక పరిణామం నాగార్జున, కొండా సురేఖ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సురేఖ కౌంటర్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇందులో నాగార్జున తరపు న్యాయవాది, సురేఖ.. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. By Anil Kumar 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున.. మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ కౌంటర్‌పై నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇందులో నాగార్జున తరపు న్యాయవాది అశోక్.. కొండా సురేఖ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆమె నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..' అంటూ కోర్టుకు తన వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! సమంతకు కొండా సురేఖ క్షమాపణలు.. ఈ వివాదంపై ఇప్పటికే కొండా సురేఖ సోషల మీడియా వేదికగా సమంతకు క్షమాపణలు కోరింది.' నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ట్వీటర్లో రాసుకొచ్చారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు..' అంటూ కొండా సురేఖ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా? ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! ఇది కూడా చూడండి: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్ #samantha #court #konda-surekha #nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి