Naga Chaithanya: కార్ రేసింగ్.. శోభితతో ఫుల్ వెకేషన్ మోడ్ లో నాగచైతన్య.. ఫొటోలు చూశారా?

నాగచైతన్య వైఫ్ శోభితతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జంట రేసింగ్ ట్రాక్ పై చిల్ అవుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శోభిత తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

New Update
naga chaithanya sobhitha

naga chaithanya sobhitha

Naga Chaithanya- Sobhitha: 'తండేల్' సక్సెస్ తర్వాత.. కాస్త గ్యాప్ దొరకడంతో  నాగచైతన్య - శోభిత వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.  ఇటీవలే  శోభితతో ఆమ్‌స్టర్‌‌డామ్ , మెక్సికో వీధుల్లో చిల్ అవుతూ కనిపించిన ఈ జంట.. తాజాగా రేసింగ్ ట్రాక్ పై సందడి చేసింది. అయితే  చైతన్య రేసింగ్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో రేస్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శోభితను కూడా అక్కడకు తీసుకెళ్లి కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శోభిత తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. శోభిత రేసింగ్ కారులో కూర్చొని ఫొటోలు దిగుతూ కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ''గార్జియస్'' కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!

గతేడాది పెళ్ళి

సమంతతో విడిపోయిన నాలుగేళ్ళ తర్వాత నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు. గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్థూడియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళికి ముందు రెండేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత రిలీజైన  'తండేల్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య భార్యతో వెకేషన్స్ తిరుగుతున్నారు.  Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

Advertisment
తాజా కథనాలు