/rtv/media/media_files/2025/04/16/Od0I5xdJ5SOvjgXYGP7e.jpg)
Nag Ashwin
Nag Ashwin: టాలీవుడ్ లో తన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD తరువాత ప్రస్తుతం దాని సీక్వెల్ పనిలో బిజీ అయిపోయారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన ఇటీవల విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు.
ఈ ప్రత్యేక ఇంటరాక్షన్‌లో నాగ్ అశ్విన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒక ఆసక్తికరమైన, భావోద్వేగమైన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ఇన్సెప్షన్ (2010)(Inception) చిత్రం తనపై ఎంతటి ప్రభావం చూపిందో ఆయన తెలిపారు.
నా ఆలోచనకి దగ్గరగా.. ఇన్సెప్షన్ : నాగ్ అశ్విన్
"నాకొక యూనిక్ ఐడియా వచ్చింది, అది ఆలోచనల గురించి. కానీ తరువాత నోలన్ తీసిన ఇన్సెప్షన్ ట్రైలర్ చూశాను. అది కలల ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఆ దృశ్యాలు చూసాక నాకు చాలా నిరాశ కలిగింది. ఎందుకంటే నా ఆలోచనకి దగ్గరగా ఉంది. అందువల్ల అప్పట్లో నేను ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాను. దాంతో ఒక వారం రోజులపాటు మానసికంగా డౌన్ అయ్యాను," అంటూ తన అనుభూతిని పంచుకున్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఈ వ్యాఖ్యలు నాగ్ అశ్విన్ క్రియేటివ్ టాలెంట్ ఏ లెవెల్ లో ఉంటుందో తెలుస్తుంది. దీంతో నాగ్ అశ్విన్ 'ఇన్సెప్షన్' లాంటి సినిమా తీస్తే ఎలాగుండేదో అన్నదానిపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
ప్రస్తుతం కల్కి 2898 AD కి సీక్వెల్ మీద దృష్టి సారించిన నాగ్ అశ్విన్, తదుపరి ప్రాజెక్టులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ నటి అలియా భట్‌తో ఆయన కలిసి పనిచేయనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..