AR Rahman: తమిళ భాషపై తన ప్రేమను చాటుకున్న ఎ. ఆర్. రెహమాన్.. ఏం చేశాడో తెలుసా?

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తమిళ భాష గొప్పతనాన్ని చాటేందుకు డిజిటల్ తమిళ స్మారక చిహ్నాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ‘ARR ఇమ్మర్సివ్ ఎంటర్‌టైన్‌మెంట్’ బృందం ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

New Update
AR Rahman Digital Tamil Monument

AR Rahman Digital Tamil Monument

AR Rahman: ప్రపంచం నలుమూలల సంగీత ప్రేమికుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మ్యూజిక్ మాస్టారు ఏఆర్ రెహ్మాన్ తన సంగీత ప్రయోగాలతో ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. 1992లో రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసిన రెహ్మాన్, తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో పాటలు అందించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు అందించిన నేపథ్య సంగీతంతో ఆయనకు ఆస్కార్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

తమిళ భాషపై రెహ్మాన్‌కు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రేమను ఇంతకు ముందే సెంమ్మొళియన్ తమిళ్ మొళి పేరుతో రూపొందించిన ఆల్బమ్‌లో ఆయన వ్యక్తపరిచారు. ఇప్పుడు తమిళ భాషకు ఓ గుర్తుగా నిలిచే మరో వినూత్న ప్రయత్నానికి రెహ్మాన్ శ్రీకారం చుట్టారు.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

డిజిటల్ తమిళ స్మారక చిహ్నం..

తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా చేసిన ప్రకటన ప్రకారం, తమిళ భాషకు అంకితంగా ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని (AR Rahman Digital Tamil Monument) రూపొందించేందుకు రెహ్మాన్ సన్నద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం 'ARR ఇమ్మర్సివ్ ఎంటర్‌టైన్‌మెంట్' బృందం ఎంతో శ్రద్ధగా పని చేస్తోంది. త్వరలోనే ఈ స్మారక చిహ్నం రూపుదిద్దుకుంటుందని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయని ఎ. ఆర్. రెహమాన్ వెల్లడించారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

తమిళ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో రెహ్మాన్ చేస్తున్న ఈ ప్రయత్నం సంగీత ప్రపంచానికే కాదు, తమిళ భాషాభిమానులకు కూడా గర్వకారణం కావడం ఖాయం.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు