ఆ స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ.. 2029 ఎన్నికలే టార్గట్ : నాగవంశీ నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో తమ బ్యానర్ నుంచి వచ్చే తదుపరి సినిమాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా చేస్తున్నాం. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఉంటుందని అన్నారు. By Anil Kumar 01 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ లో DJ టిల్లు, సార్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకుని అగ్ర నిర్మాణ సంస్థలకు పోటీ ఇస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ పొలిటికల్ మూవీ తెరకెక్కనుందట. ఈ విషయాన్నీ సితార అధినేత సూర్యదేవర నాగవంశీ స్వయంగా వెల్లడించారు. 2029 ఎన్నికలే టార్గెట్ గా.. ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'లక్కీ భాస్కర్' మూవీ దీపావళి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ." వచ్చే ఏడాది ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా మొదలు పెడతాము. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా స్టార్ట్ చేస్తాం..' అని అన్నారు. 2029 Elections లోపు... ఒక పెద్ద Star Hero తో Huge Scale లో ఒక Political సినిమా తీద్దాం అనుకుంటున్నాం....- #NagaVamsi pic.twitter.com/jjmRGPmXso — Gulte (@GulteOfficial) November 1, 2024 Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'విశ్వం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? దీంతో సోషల్ మీడియాలో ఈ పొలిటికల్ మూవీ రియల్ లైఫ్ లో ఏ పొలిటీషియన్ ను బేస్ చేసుకొని వస్తుందా? అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీనిపై ముందు ముందు నాగవంశీ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఈ సినిమాకే హైయెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. Also Read : కమల్ హాసన్ రికార్డు బ్రేక్ చేసిన 'అమరన్'.. తొలిరోజే బాక్సాఫీస్ షేక్ #producer-nagavamsi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి