Mokshagna : మోక్షజ్ఞ కు జోడిగా స్టార్ హీరోయిన్ కూతురు..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని నటించబోతోందట. ఇప్పటికే ఆమె ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చిందని సమాచారం.

mokshu
New Update

 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మోక్షు బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ సినిమా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందనున్న ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉండబోతుంది.

దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీ కోసం స్టార్ కాస్ట్ ను తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే సినిమాలో మోక్షజ్ఞకు జోడిగా ఎవరు నటిస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఇందులో భాగంగానే నందమూరి వారసుడి కోసం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏకంగా స్టార్ హీరోయిన్ కూతుర్ని రంగంలోకి దింపుతున్నారట. 

Also Read : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ కూతురు..

లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. మోక్షజ్ఞ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కూతురు  రషా తడాని నటించబోతోందట. ఈ మూవీతోనే ఆమె తెలుగు వెండితెరకు పరిచయం కానుందని సమాచారం. ఇప్పటికే రషా తడాని ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చిందని, ఆ ఆడిషన్స్ లో హీరోయిన్ రోల్ కోసం సెలెక్ట్ అయిందని తెలుస్తోంది. 

Also Read: 'పుష్ప 2' రిలీజ్ డేట్ మారిందోచ్.. బన్నీ కొత్త లుక్ మాములుగా లేదుగా

అంతేకాదు త్వరలోనే చిత్ర యూనిట్ తో షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతోందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ బ్యానర్​పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

Also Read : జానీ మాస్టర్ కు బెయిల్!

Also Read: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా?: జగన్ కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్!

#prasanth-varma #mokshagna-nandamuri #mokshagna-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe