Miss World 2025: ప్రపంచ దృష్టి మొత్తం హైదరాబాద్ వైపే.. ఈరోజు మిస్ వరల్డ్ హెడ్ టూ హెడ్ ఛాలెంజ్!

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు హైదరాబాద్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు పోటీదారులు హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని టి-హబ్ ఇన్నోవేషన్, స్టార్టప్ కేంద్రంలో ఈ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.

New Update
miss world 2025: head to head challenge

miss world 2025: head to head challenge

Miss World 2025: ప్రపంచ దృష్టి అంతా ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉంది. ఈరోజు మిస్ వరల్డ్ 2025 పోటీల్లో హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ జరుగుతోంది. హైదరాబాద్ లోని  టి-హబ్ ఇన్నోవేషన్,  స్టార్టప్ కేంద్రంలో పోటీలు ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.  మిస్ వరల్డ్ పోటీల్లో  హెడ్ టూ హెడ్ ఛాలెంజ్  కీలక ఘట్టంగా  పరిగణించబడుతుంది. 

MISS WORLD 2025
MISS WORLD 2025

 

ఈ ఛాలెంజ్ లో  "బ్యూటీ విత్ ఏ పర్పస్" రౌండ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇందులో పోటీదారులు తమ  ఆలోచనలు, వ్యక్తిగత ప్రయాణాలు, తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక మార్పు కోసం వారు చేస్తున్న కృషి గురించి  ప్రపంచానికి పరిచయం చేస్తారు.  దీని ద్వారా పోటీదారుల  మేధా శక్తి , దయా దృష్టి,  ప్రపంచ దృష్టికోణం స్పష్టంగా బయటపడతాయి. ఇవే  మిస్ వరల్డ్‌ను నిర్వచించే ముఖ్యమైన విలువలు.

MISS WORLD-2025
MISS WORLD-2025

 

MISSWORLD 2025
MISSWORLD 2025

 

హెడ్ టూ హెడ్ ఛాలెంజ్ కోసం కంటెస్టెంట్లను  రెండు ప్రధాన గ్రూపులుగా విభజించారు. మే 20న  అమెరికాస్ / కరేబియన్ , ఆఫ్రికా నుంచి  వచ్చిన అందాల భామలు పోటీపడతారు.  ఆ తర్వాత మే 21న  యూరప్ / ఆసియా,  ఓషియానియా నుంచి వచ్చిన పోటీదారులు పాల్గొంటారు.  నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ  ఈవెంట్‌ యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే #MissWorld2025 హ్యాష్‌ట్యాగ్‌తో పోటీలపై మీ  అభిప్రాయాన్ని పంచుకోండి.

telugu-news | cinema-news | latest-news | Miss World 2025 hyderabad

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు