/rtv/media/media_files/2025/04/20/DdegAR8XkzUB80erBJPB.jpg)
chiranjeevi awareness on drugs
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పిలుపునిచ్చారు. తాజాగా హైదరాబాద్ టీమ్ వర్క్స్ ఆధ్వర్యంలో నోటి క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా చిరంజీవి డ్రగ్స్ పై అవగహన కల్పిస్తూ వర్చువల్ సందేశం పంపారు. వ్యసనాలకు బానిసలై కొందరు యువత తమ కలలు, జీవితాలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలన పై ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం చేయి చేయి కలుపుదాం అని పిలుపునిచ్చారు.
'విశ్వంభర' తో బిజీ
ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ 'విశ్వంభర' తో పాటు అనిరావిపూడి దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో బిజీగా ఉన్నారు. వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న 'విశ్వంభర' జులై 14న విడుదల కానుంది. ఈ ప్రాజెక్టును యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దాదాపు 200 కోట్లకు పై ఖర్చు చేసినట్లు సమాచారం. భారీ విజువల్ గ్రాఫిక్స్ తో ఫాంటసీ చిత్రంగా 'విశ్వంభర' రూపొందుతోంది.
ఇప్పటికే ఈమూవీ టీజర్ విడుదల చేయగా.. గ్రాఫిక్ విజువల్స్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. పాన్ ఇండియా స్థాయి సినిమాలో గ్రాఫిక్ వర్క్ చాలా నాసిరకంగా ఉందంటూ ట్రోల్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సినిమాలోని అన్ని లోపాలను సరిచేసి అద్భుతమైన విజువల్స్ మళ్ళీ కొత్త టీజర్, ట్రైలర్ విడుదల చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
telugu-news | latest-news | cinema-news | drugs-free-telangana
Also Read: Mad Square OTT: థియేటర్లలో హిట్ కొట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’.. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్?