/rtv/media/media_files/2025/01/21/Kso3FnKsME1GIoqULBOJ.jpg)
sai durga tej
Sai Durgha Tej: హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ ను మెగా హీరో సాయిదుర్గ తేజ్ మంగళవారం దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకొన్న సాయి దుర్గతేజ్ మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు సాయిదుర్గ తేజ్‌కు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Also Read: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా.. కొత్త జర్నీ అంటూ పోస్ట్ ....
కాగా, ప్రస్తుతం రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడ్ యాక్షన్ డ్రామా సినిమాలో సాయిదుర్గతేజ్ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి కే.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం
పాన్ ఇండియా రేంజ్ లో సాయిదుర్గతేజ్ మూవీ..
తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇందులో నటుడు శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని త్వరలోనే తెరమీదకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.