Varun Tej: మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జి బాబు.. గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్- లావణ్య

మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. దీంతో మెగా అభిమానులు, సెలెబ్రెటీలు వరుణ్- లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

New Update
varun tej- lavanya soon to be parents

varun tej- lavanya soon to be parents

Varun Tej:  మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా ఫ్యామీలీలోకి మరో బుజ్జి పాపాయి రాబోతున్నట్లు ప్రకటించారు. ''జీవితంలో ఇప్పటివరకు అత్యంత అందమైన పాత్ర .. త్వరలో రాబోతుంది'' అంటూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు, సెలెబ్రెటీలు వరుణ్ దంపతులకు శుభాకంక్షాలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. సమంత, రకుల్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు స్నేహారెడ్డి, సుశాంత్, రీతూ వర్మ తదితరులు తమ విషెష్ తెలిపారు. 

2023 లో ప్రేమ వివాహం 

అంతరిక్ష్యం, మిస్టర్ సినిమాల్లో కలిసి నటించిన వరుణ్- లావణ్య ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. 2023  నవంబర్ 1న ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్ళైన ఏడాదిన్నర తర్వాత.. ఇప్పుడు తమ ఫస్ట్ బేబీని వెల్కమ్ చేస్తున్నారు ఈ జంట. క్లింకార తర్వాత మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జి బాబు/ పాప రానుండడంతో కుటుంబం అంతా సంతోషంలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా లావణ్య తన సినీ కెరీర్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. పెళ్లి తర్వాత లావణ్య  మొదటి సారిగా 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే వెబ్ సీరీస్ లో మెరిసింది. ఆ తర్వాత ఇటీవలే సతీలీలావతి అనే ప్రాజెక్ట్ సైన్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పుడు లావణ్య ప్రెగ్నెంట్ కావడంతో సినిమా షూట్ కంటిన్యూ అవుతుందా..? లేదా బ్రేక్ పడుతుందా? చూడాలి. 

lavanya-tripati latest-news | cinema-news | telugu-cinema-news Lavanya- varun to be parents

#Lavanya- varun to be parents #telugu-cinema-news #cinema-news #Latest News #lavanya-tripati #varun tej
Advertisment
Advertisment
తాజా కథనాలు