Mass Jathara: 'మాస్ జాతర' రిలీజ్ డేట్‌ కి ముహూర్తం ఫిక్స్.. దసరాకు భారీ అప్‌డేట్స్!

మాస్ జాతర సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 2న ప్రకటించనున్నట్లు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకి భీమ్స్ సంగీతం, శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, టీజర్‌ కి మంచి రెస్పాస్ వచ్చింది.

New Update
Mass Jathara

Mass Jathara

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న అతి పెద్ద మాస్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ సినిమాపై ఇప్పటి వరకు పలు ఊహాగానాలు కొనసాగుతున్న తరుణంలో, నిర్మాత నాగ వంశీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 2, 2025న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. 

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

ఇప్పటికే ఈ సినిమా మొదటగా 2025 ఆగస్టు 27న విడుదల కావలసి ఉంది. కానీ పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే తాజా ప్రకటనతో మళ్లీ సినిమాపై హైప్ మొదలైంది. నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ తెలియజేసిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఉంటాయని తెలిపారు.

పోలీస్ గా రవితేజ మరోసారి.. 

ఈ చిత్రంలో రవితేజ మళ్లీ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో 'క్రాక్', 'విక్రమార్కుడు', 'వాల్తేరు వీరయ్య' వంటి చిత్రాల్లో పోలీస్ రోల్స్‌తో అభిమానులను మెప్పించిన రవితేజ, ఈసారి ‘మాస్ జాతర’లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నాడు.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

ఈ చిత్రానికి భాను భోగరపు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలీల(Sree Leela) హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇందులో రవితేజ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా భీమ్స్ సిసిరోలియో పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచింది.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

ఇటీవల రవితేజ చేసిన ‘రావణాసుర’, ‘ఈగల్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈ సినిమా విజయం కోసం అభిమానులు, చిత్రబృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

ఇదిలా ఉంటే, రవితేజ తాజాగా థియేటర్ రంగంలోకి అడుగుపెట్టి, హైదరాబాద్ వనస్థలిపురంలో ‘ఆర్ట్ సినిమాస్’ పేరుతో థియేటర్ ప్రారంభించారు. ఇందులో EPIQ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్, 4K వీడియో క్వాలిటీ వంటి ఫీచర్లు ఉండడం విశేషం.

Advertisment
తాజా కథనాలు