/rtv/media/media_files/2025/09/18/marco-sequel-2025-09-18-08-42-09.jpg)
Marco Sequel
Marco Sequel: మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన హిట్ గా నిలిచినా వైలెంట్ యాక్షన్ మూవీ ‘మార్కో’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఉన్ని ముకుందన్ హీరోగా, హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదలై మంచి వసూళ్లు రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో చూపించిన 'రా' యాక్షన్, హార్డ్ హిట్టింగ్ కంటెంట్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి.
అయితే ఈ సినిమాకి సంబంధించిన వివాదాలు కూడా అప్పట్లో చర్చకి వచ్చాయి. సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాలు కొన్ని వర్గాల్లో అభ్యంతరాలకు దారి తీశాయి. అయినా కూడా, మార్కో సినిమా వసూళ్ల పరంగా మంచి రికార్డులు నెలకొల్పింది. ఇది మలయాళ పరిశ్రమలో మొదటి 'A' సర్టిఫికేట్ మూవీగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి తన సత్తా చాటింది.
సీక్వెల్ టైటిల్ ‘లార్డ్ మార్కో’(Lord Marco)
ఈ నేపథ్యంలో మార్కో సీక్వెల్ గురించి గత కొన్ని రోజులుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక దశలో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతుందన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు మేకర్స్ వాటన్నింటికి క్లారిటీ ఇచ్చారు. మార్కో సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సారి సీక్వెల్‌కు ‘లార్డ్ మార్కో’(Lord Marco) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ టైటిల్‌ను మలయాళ ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
అయితే ఇందులో ఆసక్తికర విషయమేమిటంటే, ఈ సీక్వెల్‌లో ఉన్ని ముకుందన్ లీడ్‌గా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. కథను కొత్త కోణంలో చూపించాలన్న ఆలోచనతో కొత్త హీరోని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఇదే సమయంలో ఉన్ని ముకుందన్ గురించి మరో పెద్ద అప్‌డేట్ బయటకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఓ భారీ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆయన నటించబోతున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో పాటు, మార్కో సీక్వెల్ నుంచీ తప్పుకోవడం ఉన్ని కెరీర్‌లో కొత్త మలుపు తీసుకురావొచ్చని ఫిలింనగర్ టాక్.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. 'ఫౌజీ' లో మరో స్టార్ హీరో ఎంట్రీ!
హనీఫ్ అదేని ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహించనున్నారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. 'లార్డ్ మార్కో' ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మొత్తానికి, మార్కో సీక్వెల్‌పై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. టైటిల్ వినగానే మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ పెరిగింది. అయితే హీరో మార్పు విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయినా, లార్డ్ మార్కో కూడా ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసే యాక్షన్ థ్రిల్లర్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.