Kannappa TV Premiere: దీపావళి రోజున విష్ణు మంచు స్పెషల్ సర్‌ప్రైజ్..!

విష్ణు మంచు ‘కన్నప్ప’ దీపావళిన అక్టోబర్ 19 మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు నటించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమై ఇప్పుడు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

New Update
Kannappa TV Premiere

Kannappa TV Premiere

Kannappa TV Premiere: డైనమిక్ హీరో విష్ణు మంచు(Manchu Vishnu) నటించిన డివైన్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాను, దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నారు.

Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..

ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై డా. ఎం. మోహన్ బాబు భారీ స్థాయిలో నిర్మించగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విష్ణు మంచుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన స్టార్ హీరోలు కూడా కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి గట్టిగానే ఏర్పడింది.

Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

ఓటీటీలోనూ సూపర్ హిట్..

ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసి, దీపావళి రోజు టీవీ ప్రీమియర్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ‘కన్నప్ప’ భక్తి, యాక్షన్, గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే సక్సెస్ ఓటీటీలోనూ కొనసాగింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను టీవీలో కూడా రిపీట్ చేయాలని మేకర్స్ ఆశిస్తున్నారు.

Also Read: ప్రతీ సీన్‌ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ లాంటి పాన్ ఇండియా స్టార్లు నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిలో కొన్ని పాత్రలు గెస్ట్ రోల్స్ అయినప్పటికీ, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.

Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?

ఈ సినిమా టెక్నికల్ గానూ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. స్టీఫెన్ దేవాస్సీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ సెట్‌లు అన్నీ ప్రేక్షకులను విజువల్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి. అనేక భాషల్లో రూపొందిన ఈ చిత్రం, సన్ నెట్‌వర్క్ చానళ్లలో ఒకేసారి ప్రసారం కావడం కూడా ఒక విశేషం. ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి 'కన్నప్ప'ను చూడడం మిస్ అవ్వొద్దు!

Advertisment
తాజా కథనాలు