Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్స్ కట్ ? మంచు విష్ణుకు బిగ్ షాక్

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాకు మరో షాక్ తగిలింది. ఈ సినిమాలోని పిలక, గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పాత్రలు బ్రాహ్మణులను అవహేళన చేసేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఈ పాత్రలను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.

New Update

Kannappa:  మంచు విష్ణు కన్నప్ప సినిమాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మూవీ హార్డ్ డిస్క్ దొంగతనంతో నిర్మాతలు, మంచు విష్ణు ఆందోళన చెందుతుండగా.. ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. ఈ సినిమాలోని కొన్ని పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: Shine Tom Chacko: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటుడి కారు.. తండ్రి దుర్మరణం!

బ్రాహ్మణులకు  అవహేళన

అయితే  ఇటీవలే సినిమా నుంచి  పిలక-గిలక అంటూ బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా.. ఆ పాత్రలు బ్రాహ్మణులను అవహేళన చేసేలా ఉన్నాయని మండిపడుతున్నారు. పిలక, గిలక అనే పాత్రలతో మంచు కుటుంబం..   బ్రాహ్మణ సంస్కృతి, సంప్రదాయాలను అవమానిస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మంచు ఫ్యామిలీ దేనికైనా రెడీ మూవీలో బ్రాహ్మణులను అవమానించారని, వెంటనే  'కన్నప్ప' లో పిలక- గిలక పాత్రలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.  

సినిమాను అడ్డుకుంటాం! 

సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ జాతిని కించపరిచే  'కన్నప్ప'  సినిమాను బహిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ కీలక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.  త్వరలో జరగబోతే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాత్రలపై స్పష్టత ఇవ్వకపోతే.. కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరి దీనిపై మంచు విష్ణు, మోహన్ బాబు ఎలా స్పదింస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పాత్రలను తొలగిస్తారా? లేదా సంజాయిషీ చెప్తారా? అనేది చూడాలి. 

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రసాద్ ల్యాబ్స్‌లో  'కన్నప్ప'  ఫైనల్ కాపీ వీక్షించిన మంచు విష్ణు, మోహన్ బాబు సినిమా అవుట్ ఫుట్ పై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, వంటి స్టార్ కాస్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

Also Read: Akhil Akkineni Wedding: అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు