Kannappa Vs Bhairavam: మంచు విష్ణు vs మనోజ్.. కన్నప్పకి పోటీగా దిగుతున్నాడుగా!

మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మరోసారి తలపడనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫ్యామిలీ గొడవలతో రచ్చలేపిన వీరు.. ఇప్పుడు ఒకరి సినిమాతో మరొకరు పోటీ పడనున్నారు. విష్ణు ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. అదే రోజున మనోజ్ భైరవం మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
MANCHU brothers vishnu and manoj to clash once again, this time at the box office

MANCHU brothers vishnu and manoj to clash once again

మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరిగాయి. నువ్వా నేనా అన్నట్లుగా తీవ్ర స్థాయిలో.. దాదాపు కొన్ని వారాల పాటు వీరి హంగామా నడిచింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకునే వరకు మ్యాటర్ వెళ్లింది. ప్రస్తుతానికైతే మంచు బ్రదర్స్ ఎపిసోడ్ సైలెంట్ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ మంచు విష్ణు vs మంచు మనోజ్ అన్నట్లు కనిపిస్తోంది. 

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

విష్ణు vs మనోజ్

ఇప్పటి వరకు ఫ్యామిలీ గొడవల మధ్య సాగిన ఈ అన్నదమ్ముల వ్యవహారం.. ఇప్పుడు ఒకరి సినిమాకు మరొకరు పోటీ వచ్చేంతలా మారిపోయింది. అవును నిజమే. మంచు విష్ణు ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ఒక భారీ బడ్జెట్ చిత్రం తీస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్లు పెట్టి ‘కన్నప్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఇది విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోంది. ఇందులో వివిధ భాషల స్టార్ నటీ నటులు భాగం అయ్యారు. 

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి తోపు హీరోలు కన్నప్ప మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ సైతం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘కన్నప్ప’ చిత్రం మిగతా పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధమైంది. 

Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

మరోవైపు మంచు మనోజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘భైరవం’. ఇందులో మనోజ్ సహా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ చిత్రానికి ఒక డేట్‌ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ‘కన్నప్ప’ రిలీజ్ రోజునే అంటే ఏప్రిల్ 25వ తేదీనే మంచు మనోజ్ ‘భైరవం’ సినిమాను విడుదల చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం అన్నదమ్ముల పోరు ఓ రేంజ్‌లో ఉంటుందనడంలో సందేహమేమి లేదు. దీనిపై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు