/rtv/media/media_files/2025/10/15/malavika-mohanan-2025-10-15-06-49-21.jpg)
Malavika Mohanan
Malavika Mohanan: యంగ్ హీరోయిన్లకు టాలీవుడ్‌లో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్స్ కొంతమంది తక్కువ సినిమాలు చేస్తుండగా, మరికొంతమంది గ్యాప్ తీసుకుంటుండడంతో, దర్శకనిర్మాతలు ఫ్రెష్ ఫేస్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. అలా ప్రస్తుతం వార్తల్లోకి వచ్చిందీ మాలవికా మోహనన్ పేరు.
Also Read: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!
ప్రభాస్‌తో కలిసి ‘రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్న మాలవికా మోహనన్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంటోంది. ఈ సినిమా పేరు తాత్కాలికంగా మెగా 158గా(MEGA 158) ఉంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి - బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో(Chiru - Bobby) తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్ట్ ఇది.
Also Read: ప్రతీ సీన్ క్లైమాక్స్ లా..! "డూడ్"పై మమితా బైజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నవంబర్ 5న పూజా కార్యక్రమం..
ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమా అధికారికంగా నవంబర్ 5న పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుందని సమాచారం. అనంతరం జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కావాల్సిఉండగా, ఒక హీరోయిన్ గా మాలవికా మోహనన్ పేరు పరిశీలనలో ఉంది..
Also Read: ఒకేసారి ఇద్దరు హీరోయిన్స్‌తో సిద్ధు.. ‘తెలుసు కదా’ ట్రైలర్ షాక్ ఇచ్చిందా..?
ఇది ఫైనల్ అయితే, మాలవికా మోహనన్ కు ఇది చిరంజీవితో మొదటి సినిమా కావడమే కాదు, తెలుగులో రెండో సినిమా అవుతుంది. ప్రభాస్ సరసన నటించిన ‘రాజా సాబ్’ సినిమా సంక్రాంతి 2026న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత మాలవికా మోహనన్ కి తెలుగులో వచ్చిన పెద్ద అవకాశం ఇదే అవుతుంది.
Also Read: 'రాజా సాబ్' లేట్ కి బన్నీ సినిమానే కారణం? అసలేం జరిగిందంటే..
చిరంజీవి - బాబీ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో మంచి ఎగ్జైట్మెంట్ ఉంది. బాబీ స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌కి, చిరంజీవి ఇమేజ్ కలిస్తే మరో కమర్షియల్ హిట్ ఖాయమనిపిస్తోంది. ఇప్పుడు మాలవికా మోహనన్ పేరుతో మరింత హైప్ ఏర్పడుతోంది. ఆమె నటనకి మంచి గుర్తింపు ఉండడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటినుండే హైప్ మొదలైంది.
Follow Us