SVSC Re-Release: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న కల్ట్ క్లాసిక్.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 7 న థియేటర్లలో ఈ మూవీ మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది.

New Update
SVSC Re-Release

SVSC Re-Release

SVSC Re-Release: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలలో ఫాన్స్ ను మాత్రమే కాకుండా మొత్తం టాలీవుడ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ఏది అని అంటే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"(Seethamma Vaakitlo Sirimalle Chettu) అనే చెప్పాలి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అంత నచ్చేసింది. వెంకటేశ్(Victory Venkatesh), మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ గా చరిత్ర సృష్టించింది. అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. 

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

ఒక పర్ఫెక్ట్  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించారు. 2013 సంక్రాంతి పండుగని పురస్కరించుకుని విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ రీ రిలీజ్ వార్త హాట్ గా మారింది, టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ జోరుగా సాగుతుంది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

మార్చి 7 న థియేటర్లలో..

ఈ సినిమా మార్చి 7 న థియేటర్లలో విడుదల కానుంది, దీనితో వెంకటేశ్, మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీని మరోసారి పెద్ద స్క్రీన్ పై చూడటానికి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్ తర్వాత మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

Advertisment
Advertisment
తాజా కథనాలు