సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల సైలెంట్ గా జరిగాయి. తన సినిమాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రారంభించే రాజమౌళి, ఈ సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేశ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. తన లుక్కును పూర్తిగా మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఉన్నట్టుండి మహేష్ షూటింగ్ లో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఇది 'SSMB29' షూటింగ్ అని అనుకున్నారు. Superstar #MaheshBabu in latest ad shoot!#SSMB29 look complete 🔥🔥#TamannaahBhatia #SSRajamouli #SSRMB #Telugu #GameChanger #DaakuMaharaaj #Pushpa2Reloaded #Retro #ToxicTheMovie pic.twitter.com/8oecopyeJn — Pakka Telugu Media (@pakkatelugunewz) January 9, 2025 Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి కానీ అది ఓ యాడ్ షూట్ అని తెలిసి షాక్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే.. బుధవారం మహేశ్ బాబు ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అది కూడా ఓ యాడ్ షూట్. ట్రూ జోన్ సోలార్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్, ఆ యాడ్ షూట్‌లో పాల్గొనడం జరిగింది. ఈ షూట్‌లో మహేశ్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాల్గొంది. షూట్ లో భాగంగా మహేష్ సెట్స్ లో కూర్చున్న ఫొటోలతో పాటూ ఓ వీడియో కూడా బయటికొచ్చింది. Superstar @urstrulyMahesh From Latest Ad Shoot!!😍#SSMB29 #MaheshBabu pic.twitter.com/yCXqTpgbx6 — Mahesh Babu News🦁 (@MaheshBabuNews) January 8, 2025 ఇందులో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి యాడ్స్ షూట్స్ కాకుండా వీలైనంత త్వరగా 'SSMB29' షూట్ లో జాయిన్ అయితే బాగుంటుందని ఈ సందర్భంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 'SSMB29' విషయానికొస్తే.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!