/rtv/media/media_files/oDNOR9IWUIzdRxiWpsrX.jpg)
Game Changer: రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా దిల్ రాజు కెరీర్‌లోనే ఒక పెద్ద గుణపాఠం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల 'తమ్ముడు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ 'గేమ్ ఛేంజర్' గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
ఓ తప్పటి అడుగు
''శంకర్ లాంటి పెద్ద దర్శకులతో పనిచేయడం ఇదే నాకు మొదటిసారి. పెద్ద సినిమాలు, పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100 శాతం సమస్యలు వస్తాయి. ఇది కేవలం దిల్ రాజుకే కాదు, అందరికీ ఎదురయ్యే సమస్య'' అని అన్నారు. అలాగే గేమ్ ఛేంజర్ సినిమా తన కెరీర్‌లోనే ఒక తప్పటి అడుగని వ్యాఖ్యానించారు.
పలు కథనాల ప్రకారం దిల్ రాజు ఇంకా మాట్లాడుతూ.. సినిమా రన్ టైమ్ నాలుగున్నర గంటలు వచ్చిందని ఎడిటర్ చెప్పిన మాట నిజం. నా నియంత్రణ లేకుండానే చాలా పనులు జరిగిపోయాయి. మేకింగ్ విషయంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు నిర్మాతగా దానిని ఆపాల్సిన బాధ్యత నాది. కానీ ఆ విషయంలో నేను విఫలమయ్యాను. అలాంటి ప్రాజెక్ట్ నేను చేసి ఉండకూడదు. ఇప్పటివరకు నా కెరీర్‌లో 60 వరకు సినిమాలు తీశాను. కానీ ఎప్పుడూ పెద్ద దర్శకులతో చేయలేదు. అందువల్ల నా మొదటి తప్పుడు నిర్ణంయం అదే. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అని అన్నారు. అలాగే పెద్ద దర్శకులతో పని చేసేటప్పుడు ముందుగానే అగ్రిమెంట్ లో క్లియర్ పాయింట్లు పెట్టి ముందుకు వెళ్ళాలి. కానీ అలా చేయలేకపోయాను.. అది నా తప్పే! భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అని తెలిపారు. అలాగే సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ ఎంతో కోఆపరేటివ్ గా ఉన్నారని చెప్పారు.
అంతేకాకుండా, సినిమా విడుదలైన వెంటనే పైరసీ ప్రింట్లు రావడం, వాటిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి సినిమాకు మరింత నష్టం కలిగించాయని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాను తానే పైరసీ చేసుకుంటానని కొందరు అన్నారని, అది ఎంత నీచమో ఆయన ప్రశ్నించారు. ,మొత్తంగా, 'గేమ్ ఛేంజర్' పరాజయం పట్ల దిల్ రాజు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ, కొన్ని విషయాలలో తన నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి దారితీసిందని స్పష్టం చేశారు.
Also Read: Chiranjeevi: యంగ్ ప్రొడ్యూసర్ తో మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. 'కుబేరా' ఈవెంట్ లో అదిరే అప్డేట్!