మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన తాజా చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 'సీతారామం' తర్వాత దుల్కర్ చేస్తున్న సెకెండ్ స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ మూవీపై మరింత ఆసక్తి పెంచింది.
Also Read : దవడ భాగాలు లాగుతున్నాయా?
నెట్ ఫ్లిక్స్ లో..
దీపావళి కానుకగా నేడు థియేటర్స్ లో విడుదైన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ సినిమా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది. లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. థియేట్రికల్ రిలీజ్ కు సుమారు నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
Also Read : చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు
ఇక సినిమా విషయానికొస్తే.. ఆరు వేల జీతానికి పనిచేసే ఓ మాములు బ్యాంక్ ఉద్యోగి కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? దాని కోసం ఎలాంటి పనులు చేశాడు? ఆలా చేసిన క్రమంలో హీరో ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ ఎలివెంట్స్ తో డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమాను బాగా హ్యాండిల్ చేశారని, ముఖ్యంగా సినిమాలో దుల్కర్ యాక్టింగ్ చాలా బాగుందనే టాక్ వినిపిస్తోంది.