దవడ భాగాలు లాగుతున్నాయా?

ఈ మధ్య గుండె సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. అయితే కార్డియాడ్ అరెస్ట్ లక్షణాలు నెల ముందు నుంచే కనిపిస్తాయని అంటున్నారు నిపుణులు. ఛాతీలో బరువుగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు, మెడ, దవడ భాగాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించండి.

New Update

Cardiac Arrest: ఈ రోజుల్లో గుండె సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. ఉన్నట్టుండి గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె జబ్బులు, విద్యుత్ షాక్, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.

Also Read: జిల్ జిల్ జిగేల్.. టాలీవుడ్ స్టార్లు దీపావళి విషెస్ ఎలా చెప్పారో చూడండి!

దవడలో నొప్పి 

అయితే, కార్డియాక్ అరెస్ట్ ప్రారంభ లక్షణాలు ఒక నెల ముందు నుంచే కనిపిస్తాయంటున్నారు  వైద్యులు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, ఛాతీలో బరువుగా అనిపించడం, చేతులు, మెడ, దవడ భాగాలు విపరీతంగా లాగడం, కాళ్లు, పాదాలలో వాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.

Also Read:  జిల్ జిల్ జిగేల్.. టాలీవుడ్ స్టార్లు దీపావళి విషెస్ ఎలా చెప్పారో చూడండి!

Also Read: యువరాణిలా ముస్తాబైన నటి.. కేతిక శర్మని ఇలా చూస్తే అంతే సంగతి!

Advertisment
తాజా కథనాలు